Header Banner

ఇస్రో మాజీ ఛైర్మన్ కస్తూరిరంగన్‌ కన్నుమూత! మోదీతో పాటు రాజకీయ ప్రముఖులు సంతాపం!

  Fri Apr 25, 2025 14:25        Politics

ఇస్రో మాజీ చైర్మన్ కె. కస్తూరి రంగన్ (84) ( Former ISRO chairman K Kasturi rangan) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య కారణాలతో బాధపడుతున్న కస్తూరి రంగన్ ఈరోజు (శుక్రవారం) బెంగళూరులోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ, అంతరిక్ష కమిషన్‌ చైర్మన్‌గా, అంతరిక్ష శాఖలో భారత ప్రభుత్వ కార్యదర్శిగా పనిచేశారు. దాదాపు 9 సంవత్సరాల పాటు ఇస్రో చైర్మన్‌గా పనిచేసిన కస్తూరి రంగన్.. అంత‌రిక్ష రంగంలో భార‌త్‌ను అత్యున్న‌త స్థాయికి తీసుకెళ్లారు. ఆగస్టు 27, 2003న ఆయన పదవీ విరమణ చేశారు. క‌స్తూరి రంగ‌న్ కేర‌ళ‌లోని ఎర్నాకుళంలో జ‌న్మించారు. జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయానికి ఛాన్సలర్‌గా పనిచేశారు.

 

ఇది కూడా చదవండి: మహిళలకు ప్రభుత్వం శుభవార్త.. 2-3 రోజుల్లో అకౌంట్లలోకి డబ్బులు.! వారికి ఇక పండగే పండగ..

 

అంతేకాకుండా కర్ణాటక నాలెడ్జ్ కమిషన్ ఛైర్మన్‌గా కూడా విధులు నిర్వహించారు కస్తూరి రంగన్. 2003 నుంచి 2009 వరకు రాజ్యసభ సభ్యుడిగా కూడా ఉన్నారు. అలాగే భారత ప్రణాళికా సంఘం సభ్యుడిగా కూడా కస్తూరి రంగన్ పనిచేశారు. 2004 నుంచి 2009 వరకు బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ డైరెక్టర్‌గా కూడా కస్తూరి రంగన్ విధులు నిర్వహించారు. ప‌ద్మ‌శ్రీ, ప‌ద్మ‌భూష‌ణ్‌, ప‌ద్మ విభూష‌ణ్ అవార్డులను కస్తూరి రంగన్ అందుకున్నారు. ఇస్రో మాజీ చైర్మన్ కస్తూరి రంగన్ మృతి పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో (PM Narendra Modi) పాటు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఏప్రిల్ 27న ఆయన భౌతికకాయన్ని సందర్శనార్థం రామన్ రీసెర్చ్ ఇన్స్‌టిట్యూట్‌లో ఉంచనున్నట్లు అధికారులు తెలిపారు.

 

ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్.. కొత్తగా నేషనల్ హైవే.. జిల్లాలో క్లోవర్‌ లీఫ్‌! ఆకాశనంటుతున్న భూముల ధరలు..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

సస్పెండ్ విషయంలో దువ్వాడ కీలక వ్యాఖ్యలు! తాను ఎప్పుడూ పార్టీకి..

 

మరోసారి బరితెగించిన వైసీపీ మూకలు..! ఏం చేశారంటే..!

 

వైసీపీ గుట్టు రట్టు! సెక్షన్లకే షాక్ ఇస్తున్న సునీల్ కుమార్ కేసులు!

 

ఏపీ ప్రజలకు శుభవార్త! కొత్త పెన్షన్లకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్!

 

విశాఖలో వైసీపీకి ఊహించని షాక్! ఒకవైపు అరెస్టుల కలకలం... మరోవైపు కీలక నేతలు పార్టీకి గుడ్‌బై!

 

ఉత్తరాంధ్రకు రెడ్ అలర్ట్! రాబోయే మూడు రోజులు ఈ జిల్లాలకు పిడుగులతో కూడిన కుండపోత వర్షం!

 

 

అంతా ఒక్కటయ్యారు! ఓకే బ్యారక్ లో ముగ్గురు కీలక నిందితులు!

 

వైసీపీ కి మరో షాక్.. ఆ కేసులో కీలక పరిణామం! మాజీ మంత్రి అనుచరుడు అరెస్టు!

 

ఉగ్రవాదులకు కలలో కూడా ఊహించని శిక్ష.. పహల్గాం ఘటనపై మోదీ స్ట్రాంగ్‌ వార్నింగ్‌!

 

ఆంజనేయులు కోరికను తిరస్కరించిన అధికారులు.. జైలు నిబంధనల ప్రకారం..

 

వైసీపీకి దెబ్బ మీద దెబ్బ.. మరో షాక్! ఆ జిల్లాలో ఘోర పరాజయం..

 

ప్రభుత్వం కీలక నిర్ణయం! అంగన్వాడి టీచర్ల భర్తీకి కొత్త రూల్స్! ఇకనుండి అది తప్పనిసరి!

 

హైకోర్టు సీరియస్ వార్నింగ్! ఇకపై లక్ష రూపాయల జరిమానా!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Modi #AndhraPradesh #delhi #Election2024 #APPolitics #india #JPNadda #BJPParty #BJPJPNadda